లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రెండవ రోజు పల్స్ పోలియో విజయవంతంగా నిర్వహించినట్లు మండల వైద్యాధికారి హిమబిందు తెలిపారు. 8,002 కుటుంబాలు సందర్శించి 326 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు ఆమె పేర్కొన్నారు.
తాడ్వాయిలో 100 శాతం పూర్తి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం 100 శాతం పూర్తయినట్లు మండల వైధ్యాఽధికారి ఖాసీం అలీ అన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో గల పల్స్ పోలియో బూత్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. 8,865 ఇండ్లను సందర్శించి 694 మంది పిల్లలకు చుక్కలు వేసినట్లు వివరించారు.


