కామారెడ్డి అర్బన్: అంకితభావం, నిబద్ధతతో ప్రజలకు సేవలు అందిస్తే అంతగా ఉద్యోగులు గుర్తుండిపోతారని, విశ్రాంత జీవితం సంతృప్తిగా ఉంటుందని జెడ్పీ సీఈవో చందర్ అన్నారు. మద్నూర్, రాజంపేట మండలాల పరిషత్ అధివృద్ధి అధికారులు రాణి, బాలకృష్ణలు, నిజాంసాగర్ పర్యవేక్షకులు గంగాధర్‌ల ఉద్యోగ విరమణ, వీడ్కోలు కార్యక్రమం సోమవారం జెడ్పీ కార్యాలయంలో నిర్వహించారు. సీఈవోతో పాటు డిప్యూటీ సీఈవో సురేందర్, ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్‌కుమార్, కార్యదర్శి గోపిబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ అసోసియేషన్, జిల్లా పరిషత్ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.


