ఎల్లారెడ్డి:ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో సోమవా రం నిర్వహించిన ప్రజావాణిలో నాలుగు ఫిర్యాదు లు వచ్చినట్లు ఆర్డీవో రొడ్డ ప్రభాకర్ తెలిపారు. రెవెన్యూకు సంబంధించి 3, పంచాయత్‌రాజ్‌కు సంబంధించి ఒక ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు.
కామారెడ్డి టౌన్: భిక్కనూర్ మండల కేంద్రంలో పన్ను చెల్లించకుండా కొనసాగుతున్న ఓ కార్పొరేట్ స్కూల్‌పై ఉన్నతాధికారులు తక్షణమే చర్య లు తీసుకోవాలని మండల కేంద్రానికి చెందిన బత్తుల లక్ష్మీపతి డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ఏళ్లుగా పంచాయతీ పన్నులు ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. పాఠశాలలో కనీస వసతు లు, సౌకర్యాలు లేవన్నారు. అర్హత లేని టీచర్లతో పా ఠాలు చెప్పిస్తూ విద్యాసంస్థలోనే పుస్తకాల దందా సాగిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
కామారెడ్డి క్రైం: జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌గా ముకుందరెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. పూర్తి అదనపు బాధ్యతలతో ఇదివరకు ఈఎస్‌గా పనిచేసిన హనుమంతరావు పదోన్నతిపై మల్కాజ్‌గిరి ఈఎస్‌గా వెళ్లారు. ముకుందరెరడ్డి హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చారు.
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారావుపేట్ గ్రామానికి చెందిన గైని రమేశ్‌పై హత్యకు యత్నించిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ సోమవారం తెలిపారు. ధర్మారావుపేట గ్రామానికి చెందిన గండ్ల లావణ్య,గండ్ల సతీశ్ పా తకక్షలతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ద్విచక్ర వా హనంపై వెళ్తున్న గైని రమేశ్‌ను కారుతో ఢీ కొట్టి, క ర్రతో దాడి చేశారు. దీంతో రమేశ్‌కు గాయాలయ్యా యి. ఘటనపై విచారణ చేపట్టి హత్యాయత్నానికి పాల్పడ్డ ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 73 మందికి జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు సోమవారం శిక్షలు విధించాయి. ఒకరికి రెండు రోజులు, 14 మందికి ఒక రోజు జైలు శిక్షతోపాటు మొత్తం 73 మందికి రూ.88,700 జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమన్నారు. జిల్లాలోని అన్ని పీఎస్‌ల పరిధిలో క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
నందిపేటలో మరొకరికి..
నందిపేట్ (ఆర్మూర్): నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఒకరికి వారం రోజులు జైలు శిక్ష విధిస్తూ సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేట్ గట్టు గంగాధర్ సోమవారం తీర్పునిచ్చారు. మరో ముగ్గురికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై వినయ్ తెలిపారు.


