నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట ఎంపీడీవోగా గంగాధర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు నాగిరెడ్డిపేట ఇన్‌చార్జి ఎంపీడీవోగా కొనసాగిన ప్రవీణ్‌కుమార్ నుంచి సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కాగా మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఎంపీవోగా విధులు నిర్వహించిన గంగాధర్ పదోన్నతిపై కామారెడ్డి జిల్లాకు వచ్చారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఆయనను నాగిరెడ్డిపేట ఎంపీడీవోగా నియమించారు.
కామారెడ్డిటౌన్ : లడఖ్‌లో నిర్వహించిన ‘మౌంట్ కాంగ్ యాస్తే–2’అడ్వెంచర్ యాత్రలో అరుదైన ఘనత సాధించిన కామారెడ్డి గిరిజన గు రుకుల డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీని ఘనంగా సన్మానించారు. సోమవారం మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ నిట్టు గంగాధర్ రావు, పలువురు బన్నీనీ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. నాయకులు మామిండ్ల మారుతి, చిన్నరాజు తదితరులున్నారు.
కామారెడ్డి క్రైం: పదవీ విరమణ పొందుతున్న జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ లాలు నాయక్‌ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఘనంగా స న్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. లాలు నాయక్ అంకితభావంతో విధు లు నిర్వహించి పరిశ్రమల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయ నను శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం ఆయురారోగ్యాలతో సంతోషంగా కుటుంబంతో కలిసి గడపాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్యులు హరీష్‌గౌడ్, గౌతమి, ఏఎన్‌ఎం నీరజ, ఫార్మాసిస్టు స్వప్న, హెచ్‌ఎం కల్యాణి పాల్గొన్నారు.


