కాంగ్రెస్‌తోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

Jun 30 2026 1:24 AM | Updated on Jun 30 2026 1:24 AM

మద్నూర్‌(జుక్కల్‌): కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయని సర్పంచ్‌ విశాలాక్షి అన్నారు. మండలంలోని పెద్ద శక్కర్గాలో సోమవారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోని గృహ ప్రవేశాలు చేసుకున్న లబ్ధిదారులకు ఆమె గోడ గడియారాలను పంపిణీ చేశారు. నాయకులు రాంపటేల్‌, కార్యదర్శి లక్ష్మణ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

ర్యాగట్లపల్లిలో..

భిక్కనూరు: ర్యాగట్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం బ హూకరించిన గోడ గడియారాలను సోమవారం పంపిణీ చేశారు.గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేసిన 21 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పంపించిన గోడ గడియారాలను అందజేశారు. సర్పంచ్‌ భాగ్యమ్మ, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, నేతలు ఆకిటి మల్లారెడ్డి, గడిసె సంజీవు లు,దుమాలబీరయ్య,ఏనుగు కుమారి పాల్గొన్నారు.

సొంతింటితో పేదల ముఖాల్లో చిరునవ్వు

భిక్కనూరు: సొంతింటి కల నెరవేరడంతో నిరుపేదల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోందని భిక్కనూరు సర్పంచ్‌ బల్యాల రేఖ అన్నారు. సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలో పలు ఇందిరమ్మ ఇళ్లను ఆమె ప్రారంభించి మాట్లాడారు. నిరుపేదలకు సొంతింటి ఇల్లు అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విండో చైర్మన్‌ గంగళ్ల భూమయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్‌, నేతలు మైపాల్‌రెడ్డి, నర్మల రాంచంద్రం, మద్దూరి రవి, ఆకుల రవి, రాంరెడ్డి, సాయిలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement