● ఆర్మూర్‌కు వెళ్లకుండా కట్టడి
● కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు తరలింపు
భిక్కనూరు: ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలల మతప్రార్థనల వివాదం నెలకొనడంతో మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ నుంచి ఆర్మూర్‌కు వెళ్తున్న ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని భిక్కనూరు సీఐ నరేశ్ ఆద్వర్యంలో పోలీసులు టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్నారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రాకేశ్‌రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్టు చేసేందుకు ఉత్తర్వులు ఉంటే చూపాలంటూ ఆయన మండి పడ్డారు. సుమారు గంటపాటు వాగ్వాదం కొనసాగింది. తన సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తూ తన కారులోనే కూర్చుని నిరసన తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుస్తు అరెస్టు చేస్తున్నట్లు సీఐ నరేశ్ ఎమ్మెల్యేను సముదాయించి కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలించారు.


