బాన్సువాడ : నిజాంసాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డికి బీజేపీ నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా నాయకుడు పైడిమల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుతం నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో రైతుల వరి నారుమడులు ఎండిపోతున్నాయని అన్నారు. నారు మడులను బతికించేందుకు నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలని కోరారు. నీటిని విడుదల చేసి రైతులకు భరోసా కల్పించాలని అన్నారు. లేని పక్షంలో బీజేపీ తరుఫున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు పాశం భాస్కర్‌రెడ్డి, గజ్జల మహేశ్, శ్రీకాంత్, ఉమేశ్, సాయిరెడ్డి, ప్రసాద్ తదితరులు ఉన్నారు.


