ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం
కామారెడ్డి క్రైం : గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు, ఎకై ్సజ్ అధికారుల కళ్లుగప్పి గంజాయిని జిల్లా మీదుగా దాటించేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. రోడ్డు మార్గంతోపాటు రైలు మార్గంలోనూ స్మగ్లింగ్ చేస్తున్నారు. స్మగ్లర్లు తమ కార్యకలాపాలను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారనడానికి ఇటీవల వెలుగుచూసిన ఘటనలే నిదర్శనం. దీంతో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా గంజాయి గుప్పుమంటోంది. ఎంతో మంది యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు.
జిల్లా మీదుగా భారీ స్థాయిలో గంజాయి రవాణా అవుతుండగా, జిల్లాలోనూ దిగుమతి అవుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లో గంజాయి ప్యాకెట్లు, లిక్విడ్‌ల రూపంలో సిద్ధం చేసి యువతకు విక్రయింస్తుంటారు. మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై పోలీసుశాఖ స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. అందుకే గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై నిఘా పెంచి కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
‘రైలు.. ట్రక్కు.. గంజాయికి తరలింపునకు కాదేదీ అనర్హం’ అన్నట్లు దందా సాగిస్తున్నారు గంజాయి స్మగ్లర్లు. ఒడిశా నుంచి జిల్లా మీదుగా మహారాష్ట్రకు భారీగా గంజాయి తరలిస్తున్నారు. గత నెల రోజుల వ్యవధిలో పట్టుబడిన గంజాయి పరిస్థితికి అద్దం పడుతోంది. పనసపండ్లు తరలిస్తున్న ట్రక్కులో, నాగవళి ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల పోలీసులు గంజాయిని పట్టుకున్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం వంటి చర్యలు యువత బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తాయి. జిల్లాలో డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గంజాయికి సంబంధించిన వివరాల తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.
– రాజేశ్‌చంద్ర, ఎస్పీ, కామారెడ్డి
ఒడిశా నుంచి జిల్లా మీదుగా రవాణా
ఇటీవల రైళ్లు, ట్రక్కుల్లో
పట్టుబడిన గంజాయి
మత్తుకు బానిసవుతున్న యువత
నిఘా పెంచితేనే అడ్డుకట్ట పడే
అవకాశం
జిల్లాలోని చాలాప్రాంతాల్లో గతంలో గంజాయి సాగయ్యేది. గాంధారి, లింగంపేట, రాజంపేట, మాచారెడ్డి, మద్నూర్, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలో గంజాయి మూలాలు ఎక్కువగా కనిపించేవి. మొక్కజొన్న, పత్తి పంటల్లో అంతర పంటగా సాగు చేసేవారు. అటవీ ప్రాంతాల్లోని భూముల్లోనూ గంజాయి సాగయ్యేది. పోలీస్, ఎకై ్సజ్ దాడులు పెరగడంతో కొన్నేళ్లుగా సాగు నియంత్రణలోకి వచ్చింది. దీంతో స్మగ్లర్లు కొంతకాలంపాటు విశాఖ, వరంగల్ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి జిల్లా మీదుగా మహారాష్ట్రలోని ముంబై, పూణె తదితర ప్రాంతాలకు రవాణా చేసేవారు. గంజాయి రవాణా కేసుల్లో జిల్లాకు చెందిన చాలా మందిని పోలీసులు గుర్తించారు. మత్తుపదార్థాలను పూర్తిస్థాయిలో నియంత్రించడమే లక్ష్యంగా పోలీసు, ఎకై ్సజ్‌శాఖలు ప్రత్యేక తనిఖీలు, అవగాహనా కార్యక్రమాలను పెంచడంతో అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం ధర అధికంగా వస్తుండటంతో మళ్లీ స్మగ్లర్ల కార్యకలాపాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. చిన్న మొత్తంలో గంజాయి పట్టుబడుతున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో అనేకం.


