ఎల్లారెడ్డి: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను జిల్లా ప్రత్యేకాధికారిణి, విద్యాశాఖ జేడీ ఉషారాణి సోమవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలను టీపీఎస్ స్కూల్‌గా ఎంపిక చేసిన నేపథ్యంలో అవరసమైన తరగతి గదులు తదితర వివరాలను ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు సక్రమంగా బోధించాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. ఎంఈవో రాజు లు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: సహకార ఉద్యమం అంటే కేవలం రుణాలు ఇవ్వడం కాదని, అది ఆర్థిక ప్రజాస్వామ్యమని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ అన్నారు. సహకార వారోత్సవాలను సోమవారం ఆయన ప్రా రంభించారు. సంఘాల కార్యదర్శులతో సహకార ప్రతిజ్ఞ చేయించారు. దేశం 63 వేల సహకార సంఘాల కంప్యూటీరకణ, మోడల్ బైలాస్, జాతీయ సహకార డేటాబేస్, రైతు, మహిళా, కార్మిక సహకార సంఘాలు, భారత్ టాక్సీ వంటి కొత్త సహకార మోడళ్లలను భారత ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నట్టు వివరించారు. జిల్లా సహకార శాఖ, డెయిరీ, మత్స్యశాఖ అధికారులు భూమయ్య, షేక్‌చాంద్, మురళీధర్‌గౌడ్, లక్ష్మణ్, శ్రీనివాస్, శ్వేత తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : యువత మత్తు పదార్థాల కు బానిసలుగా మారి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని మై భార త్ సంస్థ రాష్ట్ర డైరెక్టర్ అన్వేష్ పిలుపునిచ్చా రు. జిల్లా కేంద్రంలోని ఆర్‌కే కళాశాలలో మేర యువ భారత్ ఆధ్వర్యంలో ‘మై భారత్ పోర్టల్ అవగాహన – డ్రగ్స్ వ్యతిరేక సద స్సు’ సోమవారం నిర్వహించారు. యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి అధికారిక పోర్టల్‌లో పే ర్లు నమోదు చేసుకోవాలని అన్వేష్ సూచించారు. విశిష్ట అతిథులుగా హాజరైన ఉమ్మడి జిల్లా యువజన అధికారి రమేశ్, జిల్లా అడిషనల్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణ్.. మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఎకై ్సజ్ సీఐ సంపత్, ఎ స్సై రచన, ఆర్‌కే విద్యాసంస్థల సీఈవో జై పాల్‌రెడ్డి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సునీల్‌రాథోడ్ పాల్గొన్నారు.


