జూలై నెలాఖరులోగా యూనిఫామ్‌లు అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

జూలై నెలాఖరులోగా యూనిఫామ్‌లు అందిస్తాం

Jun 30 2026 1:24 AM | Updated on Jun 30 2026 1:24 AM

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ జూలై నెలాఖరులోగా యూనిఫామ్‌లు అందజేస్తామని జిల్లా అదనపు డీఆర్‌డీవో విజయలక్ష్మి అన్నారు. నాగిరెడ్డిపేట మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో వీవోఏలతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీ్త్రనిధి రుణాల రికవరీలో నాగిరెడ్డిపేట మండలం చాలా వెనకబడిందన్నారు. ప్రత్యేక కార్యాచరణతో 15 రోజుల్లో రుణాల రికవరీ శాతాన్ని పెంచాలన్నారు. అనంతరం కస్తూర్భా పాఠశాల విద్యార్థినులకు యూనిఫామ్‌లు అందజేశారు.

రూ. 813 కోట్ల 42 లక్షల రుణాలు..

బ్యాంకులింకేజీ ద్వారా జిల్లాలోని మహిళాసంఘాల సభ్యులకు ఈ ఏడాది రూ.813 కోట్ల 42 లక్షల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని అడిషనల్‌ డీఆర్డీవో విజయలక్ష్మి తెలిపారు. నాగిరెడ్డిపేటలో సోమవారం మీడియాతో మాట్లాడారు. బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పటివరకు రూ.114 కోట్ల 30లక్షల రుణాలు అందజేసినట్లు తెలిపారు. సీ్త్రనిధి ద్వారా ఈ ఏడాది రూ.89 కోట్ల 93లక్షల రుణాలు ఇవఆలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు రూ.13 కోట్ల 34లక్షలు అందజేశామని తెలిపారు. గ్రామాల్లో నూతనంగా వృద్ధుల, దివ్యాంగుల, కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీపీఎంలు శ్రీనివాస్‌, రాజయ్య, మండల సమాఖ్య అధ్యక్షురాలు శాంత, ఇన్‌చార్జి ఏపీఎం దత్తు, సీసీలు నారాయణ, రమేశ్‌, నజీర్‌, సాయిలు, సుజాత, సావిత్రి, అకౌంటెంట్‌ రాజు తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement