రైతులకు రూ.30 వేల కోట్లు ఇవ్వాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

రైతులకు రూ.30 వేల కోట్లు ఇవ్వాల్సిందే..

Jun 29 2026 1:29 AM | Updated on Jun 29 2026 1:29 AM

రైతులకు రూ.30 వేల కోట్లు ఇవ్వాల్సిందే.. కేసీఆర్‌తోనే తెలంగాణకు భద్రత

బాన్సువాడ : రైతులకు రూ.30 వేల కోట్ల రైతుభరోసా నిధులు ఇచ్చిన తర్వాతే సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని భారత్‌ గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌పై కార్యకర్తలు, బీఎల్‌ఏలకు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు పంటలకు కలిపి రూ.55 వేల కోట్ల రైతుభరోసా నిధులు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.25 వేల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారని, ఇంకా రూ.30 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళకు ప్రతి నెల రూ.2500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ నిధులు ఇంకా రూ.20 వేల కోట్లు ఇవ్వాలని, బోనస్‌ ప్రస్తావనే తీయడం లేదని అన్నారు.

‘పోచారం’ను రానిచ్చే ప్రసక్తే లేదు..

ప్రస్తుతం సర్వేలన్నీ మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొట్టమొదట బాన్సువాడలో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని సర్వేలు తేల్చినట్లు పేర్కొన్నారు. రూ. వేల కోట్లు ఇచ్చి బాన్సువాడను అభివృద్ధి చేసిన మాజీ సీఎం కేసీఆర్‌ గుండెలపై తన్ని కాంగ్రెస్‌ గూటికి చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి వస్తానంటే రానిచ్చే ప్రసక్తే లేదని కేటీఆర్‌ చెప్పారని ఆయన కార్యకర్తలకు వివరించారు. ప్రస్తుతం పోచారం వెంట ఉన్న నాయకులు సైతం కేటీఆర్‌కు ఫోన్‌ చేసి పార్టీలోకి వస్తామని చెబుతున్నారని, కానీ, కష్టకాలంలో పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని అన్నారు. ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఆగయ్య, మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్‌, హన్మంత్‌సింధే, గణేశ్‌ గుప్తా, జడ్పీ మాజీ చైర్మన్‌లు దఫేదార్‌ రాజు, దాదన్నగారి విఠల్‌రావు, నాయకులు రత్నకుమార్‌, అంజిరెడ్డి, జుబేర్‌, యలమంచలి శ్రీనివాస్‌రావు, చందూర్‌ సర్పంచ్‌ మాధవరెడ్డి, అక్బర్‌, శ్రీనివాస్‌, మక్బుల్‌, ఖలీల్‌, ఇషాక్‌, రమేశ్‌ యాదవ్‌, శివసూరి తదితరులు పాల్గొన్నారు.

మాజీ సీఎం కేసీఆర్‌ అధికారంలో ఉంటేనే తెలంగాణకు భద్రత ఉంటుందని రాజ్యసభ మాజీ స భ్యుడు కేఆర్‌ సురేశ్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభు త్వం ప్రాంతీయ పార్టీలను ముక్కలు చేయాలనే ఉద్దేశంతో ఎస్‌ఐఆర్‌ను తీసుకొచ్చిందని, ప్రతీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వచ్చే ఏడాదిలోపు బాన్సువాడలో పోచారం సింగిల్‌గానే మిగులుతారని అన్నారు. నియోజకవర్గంలో 80 వేల సభ్యత్వ నమోదు చేయాలని వీజీ గౌడ్‌ అన్నారు. ఓటు గల్లంతు కాకుండా ప్రతీ కార్యకర్త చూడాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. పోచారం లక్ష్మీపుత్రుడు కాడని, లంకపుత్రుడని ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు.

ఆ తర్వాతే సీఎం రేవంత్‌ మాట్లాడాలి

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి

వస్తుందని సర్వేలు చెప్తున్నాయి

బాన్సువాడలో బీఆర్‌ఎస్‌ సన్నాహక

సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే

వేముల ప్రశాంత్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement