కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ 1995–96 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యా ర్థులు తమ తోటి విద్యార్థి ఎం.డీ యూసుఫ్‌ఖాన్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం యూసుఫ్‌ఖాన్ ఇంటికి వెళ్లి రూ. 40 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్‌పల్లిలో ఆది వారం ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ప లువురి ఇళ్లలోని విద్యుత్ పరికరాలు కాలిపోయా యి. పలువురి ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు, మిక్సీలు, ట్యూబ్‌లైట్లు, విద్యుత్ బల్బులు చెడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.


