నిజామాబాద్ రూరల్ : రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్‌ను టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఆదివారం పరామర్శించారు. నగరంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గడు గు గంగాధర్ ఇల్లు దగ్ధమైన విషయం తెలిసిందే. నగరంలోని గంగాధర్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ పరామర్శించారు.ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించా రు. దగ్ధమైన ఇంటిని పరిశీలించారు. డీసీసీ అధ్య క్షులు నగేశ్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, రామకృష్ణ, రాంభూపాల్, సీనియర్ నాయకులు, దయాకర్ గౌడ్, అడ్వకేట్ రామకృష్ణ , కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: బాపూజీ వచనాలయానికి నిధులు మంజూరైనట్లు ఆదివారం వచనాలయ కమిటీ సభ్యులు తెలిపారు. హైదారాబాద్‌లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, రాజ్య సభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్‌లను మర్యాదపూర్వకంగా కలిసినట్లు వారు పేర్కొన్నా రు. దాదాపు రూ. 3 కోట్లతో నిర్మిస్తున్న బాపూజీ వచనాలయం రెండు అంతస్తులు పూర్తయిందన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ రూ. 15లక్షలు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ రూ. 25 లక్షలు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈసందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాపూజీ వచనాలయ కమిటీ మెంబర్‌లు తదితరులు పాల్గొన్నారు.


