కాంగ్రెస్‌తోనే ప్రజా సంక్షేమం సాధ్యం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే ప్రజా సంక్షేమం సాధ్యం

Jun 29 2026 1:29 AM | Updated on Jun 29 2026 1:29 AM

● నిజామాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి

మోపాల్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని నిజామాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మోపాల్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా నియోజకవర్గంలోని మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఇందల్వాయి మండలాలకు రూ.2.25 కోట్లచొప్పున తహసీల్దార్‌ కార్యాలయాలను మంజూరు చేసినందుకు మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే ఆర్‌ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్‌కు ఆయా మండలాల ప్రజలు, కాంగ్రెస్‌ నాయకుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మోపాల్‌ మండలంలోనే రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. సమావేశంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కూచన్‌పల్లి జలంధర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల మాజీ అధ్యక్షుడు ఎల్లోళ్ల సాయిరెడ్డి, ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రామాగౌడ్‌, సర్పంచులు, నాయకులు రాకేష్‌ యాదవ్‌, గుడి ప్రవీణ్‌రెడ్డి, సాయినాథ్‌రెడ్డి, భూమయ్య, మల్లయ్య, నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement