నిజాంసాగర్(జుక్కల్): అంగన్‌వాడీ కేంద్రాల వద్ద కూరగాయలు సాగు చేస్తూ చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాజేశ్వరి అన్నారు. శనివారం మండల కేంద్రంలో అంగన్‌వాడీ టీచర్ల సెక్టార్ సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ఆకుకూరలతో పాటు కూరగాయలు పండించాలన్నారు. కిచెన్ షెడ్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. వర్షాకాలం ఆరంభం కావడంతో సీజన్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నెలనెలా చిన్నారుల బరువులు, ఎత్తులు తప్పనిసరిగా సేకరిస్తూ రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. సెక్టార్ అధ్యక్షులు రోజా, టీచర్లు ప్రమీల, విజయలక్ష్మి, సావిత్రి, సాయవ్వ, మైశకల, విజయ, అనిత, వెన్నెల తదితరులున్నారు.


