నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): సైబర్ నేరాల నియంత్రణ కు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహి స్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఎల్లారెడ్డి డీఎ స్పీ శ్రీనివాసరావు సూచించారు. నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చే శారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. దీంతోపాటు స్టేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను నా గిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్‌ను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం స్టేషన్‌లోని సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. రాత్రివేళ పెట్రోలింగ్‌ను ముమ్మ రం చేయాలని ఎస్సైని ఆదేశించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని చెప్పారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఉన్నారు.


