మద్నూర్(జుక్కల్): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నూతనంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గోడ గడియారాలను పంపిణీ చేశారు. మండలంలో ఇప్పటి వరకు 130 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని ఎంపీడీవో రాణి అన్నారు. మండలానికి 627 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిలు, నాయకులు రాంపటేల్, గోపి, హన్మాండ్లు స్వామి, తదితరులున్నారు.


