ఇళ్ల స్థలాలు ఇప్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల స్థలాలు ఇప్పించాలి

Jun 28 2026 2:56 AM | Updated on Jun 28 2026 2:56 AM

ఇళ్ల స్థలాలు ఇప్పించాలి రెడ్‌క్రాస్‌ ఆర్థికసాయం ట్రిపుల్‌ ఐటీ సాధించిన విద్యార్థికి సన్మానం పీసీసీ ప్రధాన కార్యదర్శికి పరామర్శ ఘనంగా హెలెన్‌ కెల్లర్‌ జయంతి విద్యుత్‌ షాక్‌తో పాడి గేదె మృతి

తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎర్రాపహాడ్‌ గ్రామానికి చెందిన మాల కులస్తులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ అంబేడ్కర్‌ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి రాజలింగం ఆధ్వర్యంలో మాలసంఘం ప్రతినిధులు శనివారం సర్పంచ్‌ మల్లవ్వ, ఉప సర్పంచ్‌ ప్రభా కర్‌రెడ్డిలకు వినతిపత్రాలను అందజేశారు. నా యకులు గైని రాజలింగం, శ్రీహరి, రవీందర్‌, నర్సయ్య, కృష్ణ, శ్రీకాంత్‌, నాగేష్‌, లక్ష్మయ్య, రవి, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: పదో తరగతిలో ఉత్తమ మా ర్కులు సాధించి బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటు పొందిన విద్యార్థిని డి.నిఖితకు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తరఫున కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ శనివారం ఆర్థికసాయం అందజేశారు. లింగంపేట మండలం షెట్‌పల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన నిఖిత కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రెడ్‌క్రాస్‌ రూ.10వేల సాయం అందించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎస్పీ రాజేశ్‌ చంద్ర, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ ఎం రాజన్న, ప్రతినిధి పీవీ నర్సింహం తదితరులు పాల్గొన్నారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ఉత్తునూర్‌ గ్రామానికి చెందిన విద్యార్థిని బాకోళ్ల రక్షిత బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించడంతో స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు అభినందించి సన్మానించారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, పాల కేంద్రం అధ్యక్షుడు దొడ్లె రవి, వీడీసీ చైర్మన్‌ శ్రీకాంత్‌ రావు, మాజీ ఉప సర్పంచ్‌ శివపాటిల్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌ రెడ్డిని శనివారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. డీసీసీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ దేవరాజ్‌ గౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు గోనె శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శ్రీరామ్‌ ఆనంద్‌, మాజీ జెడ్పీటీసీ నంద రమేష్‌, నాయకులు అల్లాడి సుదర్శన్‌ తదితరులున్నారు.

శ్రీనాథ్‌రెడ్డి కుటుంబానికి..

భిక్కనూరు: లండన్‌లో మృతి చెందిన తలమడ్ల గ్రామానికి చెందిన యువకుడు శ్రీనాథ్‌రెడ్డి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శనివారం ఫోన్‌లో పరామర్శించారు. ఆయన శ్రీనాథ్‌రెడ్డి తండ్రి మల్లికార్జున్‌ రెడ్డితో పాటు బంధువు గౌరిగారి రాజిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు సహకారం అందిస్తానని గోవర్ధన్‌ వారికి హామీ ఇచ్చారు.

కామారెడ్డి అర్బన్‌ : అంధులు, బధిరులు, దివ్యాంగుల ఉద్యమాల సారధిగా ప్రసిద్ధి చెందిన హెలెన్‌ కెల్లర్‌ జయంతిని కలెక్టరేట్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల సమ్మిళిత అభివృద్ధి కార్యక్రమం (సెర్ప్‌) ఆధ్వర్యంలో అడిషనల్‌ కలెక్టర్‌ విక్టర్‌, డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి కేక్‌ కట్‌ చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. దివ్యాంగుల కోసం హెలెన్‌ కెల్లర్‌ అందించిన సేవలను వక్తలు కొనియాడారు. ట్రైనీ అడిషనల్‌ కలెక్టర్‌ రవితేజ, అడిషనల్‌ డీఆర్‌డీవో విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌/కామారెడ్డి అర్బన్‌: లింగాపూర్‌ శివారులో విద్యుత్‌ షాక్‌ తగలడంతో ఓ పాడి గేదె మృతి చెందింది. వివరాలు .. లింగాపూర్‌ గ్రామ రైతు రాజయ్యకు చెందిన పాడి గేదె శనివారం మేత కోసం పొలానికి వెళ్లింది. గ్రామంలోని ఎస్‌ఎస్‌–2 ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో ఉన్న చేనులోగల ఇనుప విద్యుత్‌ స్తంభానికి గేదె తాకడంతో ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సుమారు రూ.70 వేలు విలువైన గేదె మృతిచెందడంతో నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement