క్రైం కార్నర్
మాచారెడ్డి: మండల పరిధిలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ము గ్గురు స్నేహితుల్లో ఒకరు ఘటన జరిగిన రోజే మృతిచెందగా, మరొకరు శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రాజ న్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండ ల కేంద్రానికి చెందిన కోట అనిల్ (24), అన్వేష్ గౌడ్, వికాస్ ముగ్గురు ప్రాణస్నేహితులు, క్లాస్‌మేట్స్. అనిల్ జీవనోపా ధి నిమిత్తం దుబాయ్ వెళ్లగా, ఇటీవలనే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. సుదీర్ఘ కాలం తర్వాత మిత్రుడు రావడంతో ముగ్గురు కలిసి శుక్రవారం కారులో కా మారెడ్డికి వచ్చారు. రాత్రివేళ తిరిగి వా రు స్వగ్రామానికి వెళ్తుండగా, మాచారెడ్డి మండలం కాకులగుట్ట తండా సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి రోడ్డు ప క్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అన్వేష్ గౌడ్‌ను మెరుగైన చికిత్స నిమి త్తం హైదరాబాద్ తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం వే కువజామున ప్రాణాలు విడిచాడు. ‘నీ వెంటే నేనంటూ’ ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు స్నేహితులు మృత్యువాత పడటంతో గంభీరావుపేట గ్రామంలో విషా ద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో స్నేహితుడు వికాస్ ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
అన్వేష్ గౌడ్, అనిల్ (ఫైల్)
‘చెట్టును ఢీకొన్న కారు’
ఘటనలో మరో స్నేహితుడి
మృతి
గంభీరావుపేటలో
విషాధచాయలు


