కబడ్డీ టోర్నీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ టోర్నీ ప్రారంభం

Jun 28 2026 2:56 AM | Updated on Jun 28 2026 2:56 AM

కబడ్డీ టోర్నీ ప్రారంభం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐపై శిక్షణ

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్‌పేటలో శనివారం కబడ్డీ టోర్నీ ప్రారంభమయింది. ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న తాడ్వాయి వాస్తవ్యులు సీహెచ్‌ రాజు నాగిరెడ్డిపేట మండలకేంద్రంలో కబడ్డీ టౌర్నమెంట్‌ను ప్రారంభించారు. కామారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌, సిద్ధిపేట, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు చెందిన 17 జట్లు పాల్గొన్నాయి. కాగా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీయడంతోపాటు యువత మత్తుకు దూరమై క్రీడానైపుణ్యాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో తాను కబడ్డీ టౌర్నమెంట్‌ను నిరహిస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్‌, ఉపాధ్యక్షులు దత్తు, కిష్టయ్య, సర్పంచ్‌లఫోరం మండలాధ్యక్షుడు మురళీమోహాన్‌గౌడ్‌, నాగిరెడ్డిపేట సర్పంచ్‌ మన్నె వెంకట్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి: అన్న– అక్క మెంటార్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఏఐపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులలో 105 మందిని అన్న–అక్క మెంటార్లుగా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. వీరికి పీఐ–జామ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఏఐతో పాటు డేటాసైన్స్‌ నేర్పించనున్నట్లు వెల్లడించారు. వీరిలో 77 మందిని ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించి వీరు నేర్చుకున్న డిజిటల్‌ నైపుణ్యాలను ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా నేర్పిస్తారన్నారు. తద్వారా పాఠశాల స్థాయిలోనే పిల్లలకు అధునాతన ఏఐ సాంకేతికతపై అవగాహన వస్తుందని చెప్పారు. అసోసియేట్‌ ప్రొఫెసర్లు చంద్రకాంత్‌, శంకరయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement