విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి

Jun 28 2026 2:44 AM | Updated on Jun 28 2026 2:44 AM

విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి తహసీల్‌ భవనాల నిర్మాణానికి నిధులు ఎస్‌ఐఆర్‌లో భాగస్వాములు కావాలి

దోమకొండ: సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థినులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించాలని, వర్షాకాలంలో దోమల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేకాధికారిణి విజయేంద్ర, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను శనివారం సందర్శించి విద్యార్థినులతో కలిసి మధ్యా హ్న భోజనం చేశారు. విద్యార్థినులతో ఆ ప్యాయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలు, విద్యాభ్యాసం, వసతి, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వసతి, మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. వారి వెంట ఎంపీడీవో మధురిమ ఉన్నారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలోని ఐదు మండలాల్లో తహసీల్‌ కార్యాలయాల భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూర య్యాయి. దోమకొండ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డి పేట, మద్నూర్‌, పిట్లం మండలాల్లో పాత భవనాలు శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.2.25 కోట్లు కేటాయించారు. కాగా కొత్త మండలాలైన పాల్వంచ, మహ్మద్‌నగర్‌, రాజంపేట, రామారెడ్డి, డోంగ్లీ మండలాల్లో సొంత భవనాలులేవు. అలాగే మరికొన్ని మండలాల్లో తహసీల్‌ కార్యాలయాలు శిథిలావస్థకు చేరగా, ప్రభుత్వం వాటికి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.

కామారెడ్డి టౌన్‌ : మున్సిపాల్టీ పరిధిలోని ప్ర తి ఒక్కరూ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో భాగస్వాములు కావాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి కోరారు. కామారెడ్డి పట్టణంలోని 38వ వార్డులో శనివారం నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు జాబి తా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీఎల్‌వో సూపర్‌వైజర్‌ బాలరాజు, బీఎల్‌వోలు భార్గవి, మనోజ్‌కుమార్‌, భారతి, వార్డు ఆఫీ సర్‌ స్నేహలత, అవినాష్‌, జీపీవో ప్రవీణ్‌, నాయకులు చాట్ల రాజేశ్వర్‌, అమీర్‌, వేణు, నాగరాజు, అఖిల్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement