చుక్కల మందుకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

చుక్కల మందుకు సర్వం సిద్ధం

Jun 28 2026 2:44 AM | Updated on Jun 28 2026 2:44 AM

కామారెడ్డి టౌన్‌ : జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఆదివారం నుంచి మూడు రోజులపాటు ‘పల్స్‌ పోలియో‘ ఇమ్యునైజేషన్‌ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీకి వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 1.03 లక్షల మందికిపైగా చిన్నారులకు పోలియో డ్రాప్స్‌ వేయనున్నారు.

మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలియో బూత్‌ల ద్వారా చిన్నారు లకు చుక్కల మందు వేస్తారు. పోలియో డ్రాప్స్‌ వేయని చిన్నారులను గుర్తించేందుకు రెండు, మూడో రోజు సిబ్బంది నేరుగా ఇళ్ల వద్దకే వెళ్తారు. వివరాలు సేకరించిన అనంతరం చుక్కల మందు వేస్తారు. జిల్లాలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద 36 ట్రాన్సిట్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. అలాగే గిరిజన తండాలు, ఇటుక బట్టీలు, వలస కూలీలు ఉండే 174 హై రిస్క్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాల కోసం 22 మొబైల్‌ టీమ్‌లను రంగంలోకి దించారు.

ఆదివారం ఉదయమే సమీపంలోని పోలియో బూత్‌కు వెళ్లి పిల్లలకు చుక్కల మందు వేయించి, పోలియో రహిత కామారెడ్డి నిర్మాణానికి సహకరించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకట్‌ విజ్ఞప్తి చేశారు.

నేడు ‘పల్స్‌ పోలియో’

ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్యారోగ్య శాఖ

జిల్లాలో 1.03 లక్షల మంది చిన్నారులు

నేడు బూత్‌లలో.. రేపు, ఎల్లుండి

ఇళ్ల వద్ద పోలియో డ్రాప్స్‌ పంపిణీ

బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో

ప్రత్యేక ట్రాన్సిట్‌ పాయింట్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement