బాబుల్‌గావ్‌, బేగంపూర్‌ సర్పంచ్‌ల పిల్లలు.. | - | Sakshi
Sakshi News home page

బాబుల్‌గావ్‌, బేగంపూర్‌ సర్పంచ్‌ల పిల్లలు..

Jun 28 2026 2:44 AM | Updated on Jun 28 2026 2:44 AM

బాబుల్‌గావ్‌, బేగంపూర్‌ సర్పంచ్‌ల పిల్లలు..

జిల్లాలోని మారుమూల గ్రామమైన పెద్దకొడప్‌గల్‌ మండలం బాబుల్‌గావ్‌ గ్రామ సర్పంచ్‌ రవి తన ఇద్దరు పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. ఆయన కొడుకులు సుమిత్‌ రెండో తరగతి, సూర్యకిరణ్‌ ఒకటో తరగతి చదువుతున్నారు. ప్రైవేటు బడులకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే రూ.5 వేల ప్రోత్సాహకం ఇస్తానని రవి ప్రకటించారు.

అలాగే బేగంపూర్‌ సర్పంచ్‌ సునీత తన కూతురు అభిజ్ఙ ను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళ్లి ఎప్పటికప్పుడు పిల్లల చదువు గురించి తెలుసుకుంటారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement