యాసంగి సీజన్‌లో పంట పండింది. కాలం కలిసిరావడంతో మంచి దిగుబడులు వచ్చాయి. కొనుగోలు కేంద్రాల ద్వారానే రూ. 1,500 కోట్లకుపైగా విలువైన పంట ఉత్పత్తులను సేకరించడం గమనార్హం. రైతులు బహిరంగ మార్కెట్‌లో మరో రూ. 500 కోట్లకుపైగా విలువైన ధాన్యాన్ని విక్రయించి ఉంటారని అంచనా.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
యాసంగిలో భిక్కనూరు, తాడ్వాయి, రాజంపేట, లింగంపేట, గాంధారి, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, పెద్దకొడప్‌గల్, సదాశివనగర్, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట, దోమకొండ తదితర మండలాల్లో మక్క పంట సాగైంది. కొందరు రైతులకు ఎకరాకు 45 క్వింటాళ్ల నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. సరాసరిన 40 క్వింటాళ్లు వచ్చినట్లు అంచనా. మార్క్‌ఫెడ్ ద్వారా 41,822 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.101 కోట్లు. అలాగే రైతులు దళారులు, వ్యాపారులకు కూడా పెద్ద మొత్తంలో మక్కలు విక్రయించారు.
కలిసొచ్చిన యాసంగి
రైతన్నకు అనుకూలించిన సాగు
కొనుగోలు కేంద్రాలలో రూ. 1,500 కోట్ల పంట ఉత్పత్తుల విక్రయం
బహిరంగ మార్కెట్‌లో
మరో రూ.500 కోట్లు..


