‘ఉద్యోగుల వేతనాల కోత సరికాదు’ | - | Sakshi
Sakshi News home page

‘ఉద్యోగుల వేతనాల కోత సరికాదు’

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

‘ఉద్యోగుల వేతనాల కోత సరికాదు’ ‘ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్‌లో భాగస్వామి కావాలి’ ‘పాఠశాలల సంఖ్య తగ్గించొద్దు’ కొండెక్కిన కోడి గుడ్డు ధర రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి

కామారెడ్డి టౌన్‌ : ఎలాంటి విధివిధానాలను ప్రకటించకుండానే ఆరోగ్య బీమా పేరిట ఉద్యోగుల వేతనాల నుంచి 1.5 శాతం కట్‌ చేయడం సరికాదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) జిల్లా అధ్యక్షులు భునేకర్‌ సంతోష్‌ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన తపస్‌ అభ్యాస వర్గాలో ఆయన మాట్లాడా రు. ప్రభుత్వం ఆరోగ్య బీమాకు సంబంధించిన పూర్తి విధివిధానాలను వెంటనే వెల్లడించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో తపస్‌ రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాఘవరెడ్డి, ప్రతినిధులు రమేష్‌ కుమార్‌, సత్యనారాయణ, లక్ష్మీపతి, రాజశేఖర్‌, శశిధర్‌, సంతోష్‌, పవన్‌ కుమార్‌, శ్యామ్‌, దత్తాచారి, స్వామి పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌ : ప్రజాస్వామ్య పరిరక్షణలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ఇందులో ప్రతి ఓటరూ తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జుమ్మా నమాజ్‌ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలంటే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవడం లేదా ధ్రువీకరించుకోవడం అత్యవసరమన్నారు. ఓటరు జాబితా పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా రూపొందేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. కార్యక్రమానికి ప్రజలంతా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

కామారెడ్డి అర్బన్‌: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించవద్దని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్‌ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కామారెడ్డిలోని జెడ్పీ బాలుర హైస్కూల్‌లో సమాఖ్య జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలాఖరులో గా పీఆర్‌సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశా రు. సీపీఎస్‌ రద్దు చేయాలని, పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, ఉపాధ్యక్షుడు నారాయణ, ప్రతినిధులు రూప్‌సింగ్‌, వెంకట్‌రెడ్డి, సురేష్‌, గోపాల్‌, బాలయ్య, సాయిగౌతమ్‌, నర్సింలు పాల్గొన్నారు.

దోమకొండ: కోడిగుడ్డు ధర అమాంతం పెరి గింది. ఈనెల మొదటి వారంలో 30 గుడ్ల ట్రే హోల్‌సెల్‌ ధర రూ.170 ఉండగా.. ప్రస్తు తం రూ. 210కు చేరింది. రిటైల్‌గా రూ. 220లకు విక్రయిస్తున్నారు. కిరాణ దుకాణాల్లో మరింత పెరిగి ఒక్కో కోడిగుడ్డును రూ.8 కి అమ్ముతున్నారు. ఎండ తీవ్రత, వాతావరణ మార్పుల వల్ల ఉత్పత్తి తగ్గిందని, దీంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధర గణనీయంగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కామారెడ్డి అర్బన్‌: కొత్తగా భూమి పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు ‘రైతు భరోసా’ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇస్రోజీవాడి ఏఈవో దేవేంద్ర తెలిపారు. ఆసక్తిగల రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డ్‌, బ్యాంకుఖాతా జిరాక్స్‌లతో శనివారం ఉదయం ఇస్రోజీవాడి రైతు వేదిక వద్దకు రావాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement