నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పేరొందిన పోచారం ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. దీంతో ఆయకట్టు పరిధిలో వానాకాలం పంటల సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద వర్షం కురియకపోవడం వల్ల ప్రాజెక్టులోకి చుక్కనీరు కూడ వచ్చిచేరలేదు. దీంతో సాగు పనులు ప్రారంభం కాలేదు.
గతేడాది పుష్కలంగా వర్షాలు..
గతేడాది వర్షాలు పుష్కలంగా కురిశాయి. దీంతో పోచారం ప్రాజెక్టు పలుమార్లు అలుగు పారింది. ప్రాజెక్టులోకి 30.543 టీఎంసీల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరింది. కాగా 28.239 టీఎంసీల నీరు ప్రాజెక్టు అలుగు పైనుంచి పొంగిపొర్లి దిగువకు ప్రవహించింది. వానాకాలంలో రెండు మండలాల పరిధిలోని ఆయకట్టుకు నీరందించగా.. యాసంగిలో నిబంధనల ప్రకారం ‘బీ’ జోన్‌కు నీటిని కేటాయించారు. యాసంగి పంటల సాగు కోసం ప్రాజెక్టు నుంచి 1.364 టీఎంసీల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేశారు. దీంతో పంటలు కళకళలాడాయి. దిగుబడులు పుష్కలంగా వచ్చాయి.
డెడ్‌స్టోరేజీకి చేరిన
పోచారం ప్రాజెక్టు నీటిమట్టం
ఆయకట్టు పరిధిలో
ప్రారంభం కాని సాగుపనులు
ఆందోళనలో రైతన్నలు


