సాక్షినెట్‌వర్క్:మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం పండుగను జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. నెలవంక కనిపించగానే ఆశీర్‌ఖానాల్లో కొలువుదీరిన పీర్లను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాల్లో పీర్లను బాజాభజంత్రీల నడుమ ఊరేగించారు. యువకులు మజ్నూ, అసయ్‌దూలా ఆటలాడారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ముల్లాలు, ఫకీర్లు, దూదేకుల కులస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాయంత్రం పీర్లను చెరువుల్లో నిమజ్జనం చేశారు.


