ఉద్యోగ నియామకాల్లో మాలలకు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ నియామకాల్లో మాలలకు అన్యాయం

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

బాన్సువాడ రూరల్‌: ఎస్సీ వర్గీకరణ మూలంగా ఉద్యోగ నియామకాల్లో అమలు చేస్తున్న రోస్టర్‌ విధానంతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ మాల సంఘం రాష్ట్ర నాయకులు అయ్యాల సంతోష్‌ అన్నారు. శుక్రవారం హన్మాజీపేట్‌లో మాల సంఘం ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. ఈనెల 28న మాల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మెదక్‌లో చేపట్టనున్న భారీ నిరసనను విజయవంతం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ మూలంగా మాలలు విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు బహిరంగ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. బాన్సువాడ మాల సంఘం గౌరవ అధ్యక్షుడు పోతురాజు లింగం, నేతలు కుంట సుధాకర్‌, కాంబ్లే మధు, జింక సురేష్‌, పోతరాజు గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement