బాన్సువాడ: బాన్సువాడ కల్కి చెరువు తూము మరమ్మతులను శుక్రవారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ పరిశీలించారు. కల్కి చెరువు తూము మరమ్మతులకు రూ.27.6 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో పనులు చేపడుతున్నారు. పెద్ద తూము వద్ద బుంగ పడి చెరువులో ఉన్న నీరు వృథా అవుతుండటంతో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిధులు మంజూరు చేయించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. కల్కి చెరువు ఆయకట్టు కింద 487 ఎకరాలు ఉంది. చివరి ఆయకట్టుకు సాగునీరందించాలనే సంకల్పంతో తూము మరమ్మతులు చేపడుతున్నామని కాసుల బాల్‌రాజ్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, గంగాధర్, రవీందర్‌రెడ్డి, రమేష్, ఖలేక్, నర్సగొండ తదితరులున్నారు.


