క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

అంబులెన్స్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌

నలుగురికి గాయాలు

జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్‌ గ్రామ శివారులోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై అంబులెన్స్‌ను ట్రాక్టర్‌ ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎస్సై మహేష్‌ తెలిపిన వివరాలు ఇలా.. తమిళనాడు నుంచి ఉత్తరప్రదేశ్‌కు నూతన అంబులెన్స్‌ బయలుదేరింది. అర్గుల్‌ గ్రామ శివారులోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం అంబులెన్సు వెళుతుండగా ఓ ట్రాక్టర్‌ రాంగ్‌ రూట్‌లో ఎదురుగా వచ్చింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ ర్యాపాని అంజన్న ట్రాక్టర్‌ను అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ అంబులెన్స్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో అంబులెన్సు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ సత్యమూర్తి తంగరాజ్‌, క్లీనర్‌ సురేష్‌, ప్రయాణికులు ఫజల్‌ ఖాన్‌, తారీక ఖాన్‌కు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయాలైన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్సులో నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ తంగరాజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్‌ డ్రైవర్‌ అంజన్నపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement