బీఆర్‌ఎస్‌ నేతకు పరామర్శ | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నేతకు పరామర్శ

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

బీఆర్‌ఎస్‌ నేతకు పరామర్శ ఎమ్మెల్యేతో భేటీ ఫ్రైడే డ్రైడే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

నిజాంసాగర్‌(జుక్కల్‌): హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిజాంసాగర్‌ మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు గైని విఠల్‌ను శుక్రవారం జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే, జెడ్పీ మాజీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు పరామర్శించారు. ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు రమేష్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి షౌకత్‌అలీ హైద్రాబాద్‌లో ఉన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ను శుక్రవారం కలిశారు. మర్యాద పూర్వకంగా కలసి తాడ్వాయి మండలాన్ని అభివృద్ధిపై చర్చించారు. అలాగే మనుముందు మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టాలని కోరారు.

భిక్కనూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండలంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు యెమిమా ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి కుండీల్లో చాలా కాలంగా నిల్వ ఉన్న నీరును పారబోయించారు. పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

మాచారెడ్డి: కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతా యని మాచారెడ్డి మాజీ ఎంపీపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు లోయపల్లి నర్సింగరావు అన్నారు. శుక్రవారం అక్కాపూర్లో ఆయన ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కానుకలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బుచ్చిరెడ్డి, రాజలింగం, లింగారెడ్డి అరవింద్‌, నవీన్‌ రెడ్డి, గోపాల్‌ రెడ్డి, చంద్రం, రాజేందర్‌, బాలయ్య, దేవరాజు, నర్సింలు, తిరుపతిరెడ్డి, నారాయణ ఉన్నారు.

పేకాడుతున్న

ఆరుగురి అరెస్టు

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని రైతుబజార్‌ వద్ద పేకాట స్థావరంపై 3వ టౌన్‌ పోలీసులు దాడిచేశారు. విశ్వసనీయమైన సమాచారం రావడంతో ఎస్సై హరిబాబు పేకాట స్థావరంపై దాడి చేసి, పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4,800 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement