● ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్
బాన్సువాడ: ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ అన్నారు. శుక్రవారం ఆయనకు బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి ఎన్యుమరేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాల్‌రాజ్ మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ బద్దంగా ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రక్రియని, నియోజకవర్గంలోని ప్రతీ ఓటరు ఇందులో పాల్గొనాలని సూచించారు. ఈ ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. అన ర్హుల ఓట్లు జాబితాలో లేకుండా చూడాలని కోరా రు. బీఎల్‌వోలు వనజ, మహేశ్వరి, నాయకులు నా ర్ల రవీందర్, కృష్ణారెడ్డి, ఖలేక్, శ్రీనివాస్‌రెడ్డి, శంక ర్, జమాల్, భాస్కర్, గంగాధర్ తదితరులున్నారు.
బీబీపేట పరిధిలో..
బీబీపేట: మండలంలోని జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి శుక్రవారం ఎన్యుమరేషన్ పత్రం నింపి ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఆయనతో పాటు ఎస్‌ఆర్ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పా ల్గొని ఓటు హక్కు నమోదు పత్రాన్ని నమోదు చేసుకున్నారు. గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఆర్ ఫౌండేషన్ సభ్యులు వెంకట్‌గౌడ్, జీవన్‌రెడ్డి, సాయికుమార్, వెంకట్ రాంరెడ్డి, సాయికుమార్ పాల్గొన్నారు.
బాన్సువాడ పరిధిలో..
బాన్సువాడ రూరల్: ఎన్నికల కమిషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం బాన్సువాడ మండలంలోని అన్ని గ్రామాల్లో కొనసాగుతోంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి పత్రాలు అందించడమే కాకుండా, పలువురి నుంచి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. తాడ్కోల్, బోర్లం, ఇబ్రాహీంపేట్, దేశాయిపేట్, కొత్తాబాది గ్రామాల్లో ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.
ఎల్లారెడ్డి పట్టణంలో..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని 2వ వార్డులో ఓటర్లకు బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ ఫారాలను శుక్రవారం పంపిణీ చేశారు. 2002 కంటే ముందు ఓటు హక్కు ఉన్న వారు 1, 2 కాలం పూర్తి చేయాలని, 2002 కంటే ముందు ఓటు హక్కులేని వారు 1, 3 కాలంను పూర్తి చేయాలని బీఎల్‌వోలు ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్, తదితరులున్నారు.
నస్రుల్లాబాద్ పరిధిలో..
నస్రుల్లాబాద్: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలను అందించారు. దీనిలో భా గంగా సంగం గ్రామంలో సర్పంచ్ ఉమారాణి గ్రా మ ప్రజలకు ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్య క్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరకు పత్రాలు ఎలా పూరించాలో వివరించారు. నాయకులు వినోద్, బీఎల్‌వోలు పాల్గొన్నారు.


