ఆలయాల నిర్మాణంతో ధర్మాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఆలయాల నిర్మాణంతో ధర్మాభివృద్ధి

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ అధినేత సుభాష్‌రెడ్డి

భిక్కనూరు: గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణంతో ధర్మాభివృద్ధి జరుగుతుందని ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ అధినేత, విద్యాదాత తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి అన్నారు. కాచాపూర్‌లో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయం ప్రారంభోత్సవం, గంగా భవానీ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆలయాల నిర్మాణం వల్ల రాబోయే తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయన్నారు. సమాజంలో ఐక్యత, నైతిక విలువల పెంపుదలకు దోహదపడుతుందన్నారు. సర్పంచ్‌ జ్యోతి.. విధ్యాదాత ఎస్‌ఆర్‌ పౌండేషన్‌ అధినేత సుభాష్‌రెడ్డిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పలు మండలాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవార్లకు ఒడి బియ్యం పోసి కట్నకానుకలను సమర్పించుకున్నారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement