కామారెడ్డి టౌన్/కామారెడ్డి అర్బన్: గౌడ సమాజ అభ్యున్నతికి అధికారులు, ప్రొఫెషనల్స్ అందరూ ‘గోపా’ వేదికగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(గోపా) రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న జిల్లా కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. సమాజంలో విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి యువత, ఉద్యోగులను సంఘటితం చేయాలన్నారు. జిల్లాలో 5 వేల సభ్యత్వాలను నమోదు చేయడమే తమ లక్ష్యమని నూతన కమిటీ ప్రకటించింది.
నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
గోపా జిల్లా అధ్యక్షుడిగా రంగా వెంకటేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా లింగాల రాజబాబు గౌడ్, కోశాధికారిగా నడిల్లా యాదగౌడ్, ప్రధాన సలహాదారులుగా ఉప్పునూతల రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులుగా అంకన్నగారి నాగరాజ్ గౌడ్, అనుగూనూరి కృష్ణ గౌడ్, అర్గనైజింగ్ కార్యదర్శిగా బాబాగౌడ్, సహాయ కార్యదర్శులుగా హరీష్‌గౌడ్, కృష్ణగౌడ్, శివగౌడ్, కార్యదర్శులుగా స్వామిగౌడ్, నరేందర్, రేణుక, అరుణ్‌లను ఎన్నుకున్నారు. గోపా నాయకులు యల్మకంటి మీరయ్య గౌడ్, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, ఆర్‌టీవో ప్రదీప్ గౌడ్, తదితరులున్నారు.


