బాన్సువాడ: ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరంలా మారిందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి నియోజకవర్గంలోని 51 మంది లబ్ధిదారులకు రూ.14. 43 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు అనారో గ్యం బారిన పడి వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని, పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం సీఎం సహాయ నిధి పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తుందని అన్నారు.
శెట్పల్లి గ్రామంలో..
లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఆదేశాల మేరకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు. గ్రామానికి చెందిన గోనె లింగంకు రూ. 60 వేల చెక్కును పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు అట్టెం మల్లయ్య, ఉపసర్పంచ్ మన్నె బాలయ్య, నేతలు సాయాగౌడ్, లింగాగౌడ్, అశోక్, అంజనేయులు, బాలరాజు, అరవింద్, ప్రభురాజ్ తదితరులు పాల్గొన్నారు.


