పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ‘డ్రగ్స్‌కు నో’ అనే నినాదంతో శనివారం ఉదయం 2కే రన్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ రన్‌లో స్థానిక యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ తిరుపయ్య, ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల మహమ్మారి యువత భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను పాడుచేసుకోవద్దని పిలుపునిచ్చారు. పిట్లం సర్పంచ్ చంద్రశేఖర్, తిమ్మనగర్ సర్పంచ్ ప్రవీణ్, పోతిరెడ్డి పల్లి సర్పంచ్ హేంసింగ్, తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో నీటి ఎద్దడి నివారణకు శుక్రవారం బోర్‌బావిని తవ్వించినట్టు వార్డెన్ పవన్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది గంగ రాములు పాల్గొన్నారు.


