పోలీసులు అక్కడ.. వాహనదారులు ఇక్కడ | - | Sakshi
Sakshi News home page

పోలీసులు అక్కడ.. వాహనదారులు ఇక్కడ

Jun 26 2026 4:11 AM | Updated on Jun 26 2026 4:11 AM

ఎల్లారెడ్డి: జిల్లాలో వాహనాల తనిఖీలు నామ మాత్రంగా కొనసాగుతున్నాయి. రోడ్లపై పోలీసులు వాహనాల తనిఖీలు ప్రారంభించగానే కొందరు వాహనదారులు ఈ విషయాన్ని ప సిగట్టి వారికి కూతవేటు దూరంలోనే ఆగిపోతున్నారు. వాహనాల సరైన పత్రాలు లేని, హెల్మె ట్లు ధరించని, చలాన్ల బకాయిలు ఉన్న వాహనదారులు ఇలా పోలీసుల చెకింగ్‌లకు దూరంగా నిలుచుంటున్నారు. సరైన ధృవపత్రాలు ఉన్నవారు మాత్రమే చెకింగ్‌ జరిగే చోటు నుంచి వెళుతున్నారు. మండలంలోని రోడ్డుపై గురువారం పోలీసులు తనిఖీలు చేపట్టగా, వాహనదారులు ఇలా వేచిచూస్తుండగా ఈ దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. పోలీసుల తనిఖీలు చేసినంత సేపు వారు అలాగే ఉండి, పోలీసులు వెళ్లిన తర్వాత వారంతా వెళ్లిపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement