● నల్గొండవాసి మృతి
భిక్కనూరు : మండల కేంద్ర సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. నల్గొండ జిల్లా నలకల్ గ్రామానికి చెందిన అఖిల్ (20) తన స్నేహితుడైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఓంకార్‌తో కలిసి ఆదిలాబాద్‌కు బైక్‌పై వెళ్తున్నారు. భిక్కనూరు పట్టణ శివారులో లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా, అఖిల్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఓంకార్ పరిస్థితి విషమంగా ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


