ప్రేమగా చెప్పి మార్చే ప్రయత్నం
పౌరులు ఇచ్చిన సమాచారంతోనే..
నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో ఉండటంతో డ్రగ్స్ ముఠాల కన్ను పడుతోంది. డ్ర గ్స్, గంజాయి, సింథటిక్ పిల్స్, కల్తీ కల్లును కాలేజీ లు,హాస్టళ్ల దగ్గర విద్యార్థులకు అలవాటు చేసే ప్ర యత్నం జరుగుతోంది. ‘ఒక్క పఫ్ చాలు, ఒక్క మా త్ర చాలు’ అంటూ యువతను ఉచ్చులోకి లాగుతున్నారు.
రాత్రి గస్తీ, పగలు కౌన్సెలింగ్
జిల్లాలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న డ్రగ్స్ కల్చ ర్ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బ లగాలు ద్విముఖ వ్యూహాన్ని సిద్ధం చేశాయి. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్–ఎన్‌ఏబీ) ఆధ్వర్యంలో జిల్లాలో పలు యూనిట్లు నిరంతరం పనిచేస్తున్నాయి. అర్ధరాత్రి 2 గంటలకు సైతం చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీ చేపడుతున్నారు. అదే సమయంలో పగలు ఖాకీ డ్రెస్ పక్కన పెట్టి కాలేజీల్లో యువతకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాల్లో విద్యార్థులతో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రిలో డీ అడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి డ్రగ్స్ బారినపడ్డ యువతను సన్మార్గం వైపు నడిపించే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఉచిత కౌన్సెలింగ్‌కు టోల్ ఫ్రీ
మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని డిప్రెషన్, ఆందోళన, ఆత్మహత్య లాంటి ఆలోచన నుంచి విరమించుకునేలా కేంద్రం జాతీయ మానసిక హెల్ప్‌లైన్ ప్రవేశపెట్టింది. టోల్ ఫ్రీ నంబర్ 14416కి 24 గంటల్లో ఎప్పుడైనా సరే కాల్ చేసి ఉచితంగా కౌన్సెలింగ్ పొందవచ్చును. ఈ కౌన్సెలింగ్ సేవలు దేశంలోని 20 భాషల్లో అందుబాటులో ఉంటుంది.
‘భయ్యా, ఒక్కసారి ట్రై చెయ్యి, టెన్షన్ పోతుంది’ అని స్నేహితుడు ఇచ్చిన ఆ ఒక్క మాత్ర.. 19 ఏళ్ల కిరణ్ (పేరు మార్చాం) జీవితాన్ని మూడు నెలల్లోనే చీకట్లోకి నెట్టేసింది. నేడు అదే కిరణ్ తన కళాశాల వేదికపై నిలబడి ‘నేను చేసిన తప్పు మీరు చేయకండి’ అని వందలాది మంది విద్యార్థులకు చెప్తున్నాడు. జిల్లా యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా సీపీ సాయి చైతన్య ఫుల్ ఫోకస్ చేశారు. నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. – ఆర్మూర్
లాఠీతో కొడితే భయపడి డ్రగ్స్ మానేస్తారు.కానీ,మళ్లీ మొదలుపెడతారు.ప్రేమతో చెబితే గుండెల్లో గుచ్చుకుంటుంది. అందుకే విద్యార్థులు, యువతకు అవగాహన కల్పిస్తూ ప్రేమగా చెప్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలల్లో వందల సంఖ్యలో అవగాహన సదస్సులు నిర్వహించాం.– సాయి చైతన్య, సీపీ, నిజామాబాద్
మీ వీధిలో ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నా, వాడుతున్నా భయపడకుండా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లు 112 లేదా 1908 కు కాల్ చేయండి. సమాచారం ఇచ్చిన వారి గుర్తింపును బయటకు రానివ్వం. పౌరులు ఇచ్చిన సమాచారంతోనే చాలా కేసులు పరిష్కరించాం.
– వెంకటేశ్వర్‌రెడ్డి, ఏసీపీ, ఆర్మూర్
నియంత్రణ కోసం కదం తొక్కిన
పోలీస్ యంత్రాంగం
ద్విముఖ వ్యూహం అమలు
విద్యార్థులకు అవగాహన సదస్సులు
నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల
వ్యతిరేక దినోత్సవం


