డిగ్రీ కళాశాలలో సోలార్‌ లైట్లు ఏర్పాటు చేయిస్తాం | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ కళాశాలలో సోలార్‌ లైట్లు ఏర్పాటు చేయిస్తాం

Jun 26 2026 4:11 AM | Updated on Jun 26 2026 4:11 AM

డిగ్రీ కళాశాలలో సోలార్‌ లైట్లు ఏర్పాటు చేయిస్తాం బైక్‌ చోరీ కేసులో ఒకరి అరెస్ట్‌ బాలుడిని అప్పగించిన పోలీసులు విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాజు

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, రాశి వనంలో సోలార్‌ లైట్లు ఏర్పాటు చేయిస్తానని ప్రముఖ సైంటిస్ట్‌ డాక్టర్‌ పైడి ఎల్లారెడ్డి హామీ ఇచ్చారు. కళాశాల మైదానం, రాశి వనాన్ని గురువారం ఆయన సందర్శించారు. అనంతరం మైదానం ఆవరణలో వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు సుధాకర్‌ రావ్‌, రాశివనం అధ్యక్షుడు శ్యామ్‌ గోపాల్‌, ఆర్‌.కె. విద్యాసంస్థల గ్రూప్‌ చైర్మన్‌ జైపాల్‌ రెడ్డి, ప్రతినిధులు రాజేశ్వర్‌ రావ్‌, రాంశెట్టి భూపతి, గెరిగంటి లక్ష్మినారాయణ, నర్సింలు, ఆంజనేయులు, రాజిరెడ్డి, సంతోష్‌, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాచారెడ్డి: బైకు చోరీ కేసులో ఒకరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అనిల్‌ తెలిపారు. మండలంలోని వెనుక తండాకు చెందిన మాలోత్‌ రాజు ఈనెల 23న తన బైకును వారాంతపు సంతలోని కల్లు దుకాణం సమీపంలో పార్క్‌ చేసి కూరగాయలు అమ్మడానికి వెళ్లాడు. సాయంత్రం వచ్చి చూసేసరికి బైక్‌ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం వాహనాల తనిఖీ చేస్తుండగా రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టంపల్లికి చెందిన మొగుళ్ల శ్రీనివాస్‌ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో పట్టుకొని విచారించగా బైకును చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడని ఎస్సై తెలిపారు. నిందితుడి నుంచి రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

మద్నూర్‌(జుక్కల్‌): మండల కేంద్రానికి చెందిన నాలుగేళ్ల బాలుడు అయాంక్‌ గురువారం మధ్యా హ్నం ఆడుకుంటూ ఇంటి నుంచి పాత బస్టాండ్‌కు చేరుకున్నాడు. పాత బస్టాండ్‌ వద్ద ఉన్న బాలుడు కొద్దిసేపటికే ఏడుస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మోహన్‌రెడ్డి పాత బస్టాండ్‌కు చేరుకొని తప్పిపోయిన బాలుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాలుడి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో సాయంత్రం బాలుడి తల్లి జయశ్రీ స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లింది.

కామారెడ్డి అర్బన్‌: విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐ క్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా దేమే కమ్మరి రా జు ఎన్నికయ్యారు. కామారెడ్డి బృందావన్‌ గార్డెన్‌లో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎరోజు భిక్షపతి, ఉపాధ్యక్షుడు వడ్ల భీమయ్య ఆధ్వర్యంలో గు రువారం అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించగా తిరుమల స్వామి, దేమి కమ్మరి రాజు పోటీ ప డ్డారు. రాజు ఎన్నికై నట్టు రాష్ట్ర నాయకులు ప్రక టించారు. అనంతరం జిల్లాలోని ఆయా మండలాల అధ్యక్షులను ప్రకటించారు. జిల్లా స్థాయి పూర్తి కమిటీని త్వరలోనే నియమిస్తామని నూతన అధ్యక్షుడు రాజు ప్రకటించారు. నాయకులు వెంకన్న, రామచంద్రం, కమ్మరి సాయిలు, బ్రహ్మం, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement