కామారెడ్డి టౌన్: జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని, తప్పనిసరిగా నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని డీఎంహెచ్‌వో వెంకట్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం జిల్లా పరిధిలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల వై ద్యాధికారులు, జిల్లా ప్రోగ్రాం అధికారులతో ఆయ న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జాతీయ క్షయ, కుష్ఠు వ్యాధి నిర్మూలన, వెక్టర్ బోన్ వ్యాధుల నియంత్రణ, సార్వత్రిక టీకాల కా ర్యక్రమం, మాతా, శిశు ఆరోగ్య సేవలు, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, కుటుంబ నియంత్రణ, జాతీయ మానసిక, అనీమియా ముక్త్ భారత్, పొ గాకు నియంత్రణ, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాల సేవల పురోగతిని తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం డీఎంహె చ్‌వో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సే వలు మెరుగుపరిచి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని కోరారు. జిల్లా పోగ్రాం అధికారులు రోహిత్ కుమార్, ప్రదీప్ కుమార్, వెంకట్ స్వామి, వైద్యాధికారులు మహేందర్ రెడ్డి, గాలమ్మ, వేణుగోపాల్, చలపతి, పద్మజ, జానాబాయ్ ఉన్నారు.


