సంక్షిప్తం.. | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం..

Jun 26 2026 4:11 AM | Updated on Jun 26 2026 4:11 AM

నారుమళ్లను రక్షించుకోవాలి

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రాత్రి, పగలు ఉష్ణోగ్రతలలో వ్యత్యాసం ఉండడం వల్ల నారుమళ్లు ఎర్రబడుతాయని, వెంటనే నారుమళ్ల సంరక్షణ చర్యలు చేపట్టాలని మాల్తుమ్మెద రైతువిజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త రేవంత్‌ నాథన్‌ రైతులకు సూచించారు. మండలంలోని తాండూర్‌ శివారులో గురువారం నారుమళ్లను ఆయన పరిశీలించారు. ఎర్రబడ్డ నారుమళ్ల సంరక్షణ కోసం లీటర్‌ నీటిలో ఎన్‌.పీ.కే మందును 5గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు. దీంతోపాటే ఫార్ములా 4ను లీటర్‌ నీటిలో 5గ్రాముల చొప్పున కలిపి వారంలో రెండు పర్యాయాలు పిచికారి చేసుకోవాలన్నారు. నాగిరెడ్డిపేట ఏవో సాయికిరణ్‌ ఉన్నారు.

కాంగ్రెస్‌లో పలువురి చేరిక

కామారెడ్డి టౌన్‌: పట్టణ బీఆర్‌ఎస్‌ నాయకులు నవీన్‌యాదవ్‌తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేశారు. వారికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, ప్రజలు కాంగ్రెస్‌ వైపు వస్తున్నారని తెలిపారు. నాయకులు అనిల్‌ యాద వ్‌, అవినాష్‌ యాదవ్‌, అజయ్‌, ఆనంద్‌, ప్రశాంత్‌, విజయ్‌, ఉమామహేశ్వరి, అఖిల, అనిత, మంజుల, రాజమణి, లావణ్య, తదితరులు ఉన్నారు.

నాగిరెడ్డిపేట మండలంలో..

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామపంచాయతీ పరిధిలోని పలువురు వార్డుసభ్యులు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వార్డుసభ్యులు తలారి శోభ, బైండ్ల శ్రీనివాస్‌, కుడికాల రాజు, జోగు లక్ష్మీ, పుప్పాల శివరాములు, బోయిన పవిత్ర, సిద్ధిరాములు, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు మురళీమోహన్‌గౌడ్‌, తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement