గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

బాన్సువాడ రూరల్‌: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, గ్రంథాలయాలను విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డా.గంగాధర్‌ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి పాలనలో భాగంగా కళాశాలలో విద్యావారోత్సాలు నిర్వహించారు. అందులో భాగంగా కళాశాలలో మన గ్రంథాలయం, జ్ఞానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కళాశాలలో 9 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే డిజిటల్‌ లైబ్రరీ సౌకర్యం ఉందని, విద్యార్థులు వివిధ దినపత్రికలతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు. అనంతరం ఐక్యూఏసీ బున్ని వినయ్‌కుమార్‌తో పాటు విద్యార్థి విష్ణును ప్రిన్సిపల్‌ గంగాధర్‌, లైబ్రేరియన్‌ గోపాల్‌లు అభినందించారు.

‘పుస్తకాలే వ్యక్తి నిర్మాణానికి దోహదపడతాయి’

కామారెడ్డి అర్బన్‌: పుస్తకాలే వ్యక్తి నిర్మాణానికి దో హద పడుతాయని కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళా శాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ అన్నారు. విద్యావారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన, డిజిటల్‌, ఈ–లైబ్రరీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమన్వయకర్త జయప్రకాష్‌ ‘అమ్మ’ పుస్తక సమీక్ష చేశారు. సాధారణ మహిళ సమాజంలో తీసుకువచ్చిన కథా అంశంతో అమ్మ పుస్తకం ఉంటుందన్నారు. రష్యన్‌ రచయిత మాక్సిమ్‌ గోర్కి రాసిన మదర్‌ నవలను క్రోవాడి లింగరాజు తెలుగులోకి అమ్మ పేరిట అనువాదం చేశారన్నారు. అధ్యాపకుడు తిరుమల మల్సూర్‌ ‘ఇన్లాండ్‌ ఫిషరీస్‌ అండ్‌ అక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌’ పుస్తకాన్ని ప్రిన్సిపల్‌ ఆవిష్కరించారు. వైస్‌ ప్రిన్సిపల్‌ కిష్టయ్య, సమన్వయకర్తలు విశ్వప్రసాద్‌, సుధాకర్‌, శ్రీనివాస్‌రావు, శ్రీవల్లి, మానస, రాజ్‌ గంభీర్‌రావు, గ్రంథాలయ సహాయకురాలు జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలోని గ్రంథాలయంలో శుక్రవా రం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. లైబ్రేరియన్‌ జాకీర్‌, పాఠకులు, సిబ్బంది తదితరులున్నారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని గ్రంథాలయంలో పుస్తక పఠనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠకులకు పుస్తకాలను అందజేశారు. మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ప్రజాపండరి, గ్రంథాలయం ఇన్‌చార్జి రేఖ తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలి

తాడ్వాయి(ఎల్లారెడ్డి): గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని ఎంఈవో రామస్వామి అన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో శుక్రవారం పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈవో రామస్వామి, హెచ్‌ఎం కళ్యాణి, మాజీ వైస్‌ఎంపీపీ నర్సింలు, మాజీ సర్పంచ్‌ సంజీవులు, గ్రంథపాలకుడు రాజలింగం, వీడీసీ చైర్మన్‌ రాజు, జీపీ కార్యదర్శి బాలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement