వేసవిలో
● శిక్షణ పొందుతున్న విద్యార్థులు
● నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం
పెరుగుదలకు దోహదం
బోధన్‌లోని ఎస్‌ఆర్ కంప్యూటర్స్‌లో శిక్షణ
పొందుతున్న విద్యార్థులు
బోధన్: సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పు నేపథ్యంలో కంప్యూటర్ విద్య పట్ల మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. వేసవి సెలవుల సమయాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండటం అత్యంత అవసరమైన నైపుణ్యమని నిపుణులంటున్నారు. కంప్యూటర్ విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యల పరిష్కారానికి నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతాయి. సాలూర మండల కేంద్రానికి చెందిన కంప్యూటర్ మాస్టర్ కృష్ణప్రసాద్ బోధన్ పట్టణ కేంద్రం, సాలూర మండల కేంద్రాల్లో ఎస్‌ఆర్ కంప్యూటర్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ రెండు కేంద్రాల్లో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. డీసీఏ, పీజీడీసీఏ, జేవోసీ, డీటీపీ, ఫొటోషాప్, ఇంటర్నెట్, ఇతర కోర్సుల్లో శిక్షణనిస్తున్నారు. 30 నుంచి 45 రోజుల వ్యవధితో కోర్సులను నామమాత్రపు ఫీజుతో అందిస్తున్నారు.


