డొంకేశ్వర్(ఆర్మూర్): హైదరాబాద్‌లో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌కు డొంకేశ్వర్ పీఎంశ్రీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి సుశాన్ ఎంపికయ్యాడు. సమగ్ర శిక్షణ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ‘రాష్ట్ర స్థాయి తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్’ అనే వర్క్‌షాప్ ఈ నెల 17 వరకు జరుగుతుందని హెచ్‌ఎం సురేశ్ కుమార్ తెలిపారు.
నిజామాబాద్ రూరల్: రాష్ట్ర డీజీపీగా బాధ్యత లు చేపట్టిన సీవీ ఆనంద్‌ను జిల్లా కాంగ్రెస్ ము ఖ్య నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో మ ర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొక్కను అందించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చై ర్మన్ అన్వేష్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రెటరీ గంగారెడ్డి ఉన్నారు.
ఖలీల్‌వాడి : నిరుద్యోగ యువత పోటీ పరీక్షల కు సిద్ధం కావాలని, ఉద్యోగ సాధనకు పుస్తకా లు ఎంతగానో దోహదపడతాయని డీఈవో పార్శి అశోక్ సూచించారు. ప్రజాపాలన–ప్రగ తి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా శు క్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ ప రీక్షల పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో హాజరై పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షలకు అనుకూలంగా సన్నద్ధమైతే ఉద్యోగం సాధించవచ్చని తెలిపారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన నుంచి జిల్లా గ్రంథాలయ వ్యవస్థలో మార్పులు తేవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం డీఈవో అశోక్‌ను సన్మానించారు.
ఖలీల్‌వాడి: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష లు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన శుక్రవారం ఉదయం ఫస్టియర్, మధ్యా హ్నం సెకండియర్ మ్యాథ్స్, బోటనీ, పొలిటిక ల్ సైన్స్ పరీక్షలు జరిగినట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులు 8,494 మందికిగాను 8,072మంది హాజరుకాగా, 422 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే సెకండి యర్ విద్యార్థులు 3,127మందికిగాను 2,985 మంది హాజరుకాగా, 142మంది గైర్హాజరయ్యారన్నారు.


