కుటుంబకలహాలతో మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబకలహాలతో మహిళ ఆత్మహత్య

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలో ని బ్రహ్మాజివాడి గ్రామానికి చెందిన శెట్‌పల్లి మంజుల (25) కుటుంబకలహాలతో ఆత్మహ త్య చేసుకున్నట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు. ఈ నెల 13న పిల్లల విషయంలో మంజుల తన అత్తతో గొడవ పడింది. దీంతో మనస్తాపానికి గురైన మంజుల అదే రోజు ఇంటిముందు ఉన్న రేకుల షెడ్‌లో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న మంజులను గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి పంపించారు. మంజుల పరిస్థితి మరింత విషమించడంతో తిరిగి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందిందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త నవీన్‌, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి తండ్రి దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి

మోపాల్‌ : మండలంలోని తాడెం గ్రామానికి చెందిన అంజాద్‌ ఖాన్‌ (45) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై జాడె సుస్మిత శుక్రవారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం అంజాద్‌ ఖాన్‌ తన ద్విచక్ర వాహనంపై తాడెం నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్నాడు. బోర్గాం(పి) గ్రామశివారులోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి పడిపోయాడు. ప్రమాదంలో అంజాద్‌ఖాన్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి అంజాద్‌ ఖాన్‌ మృతిచెందాడు. మృతుడి సోదరుడు జావిద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సుస్మిత తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement