మోపాల్ : మండలంలోని కంజర్ శివారులో సొసైటీ ఆధ్వర్యంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు శుక్రవారం దగ్ధమయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. షేక్ దావూద్ అనే రైతు బస్తాలు మూడు రోజుల క్రితం తూకం వేశారు. గుర్తు తెలియని రైతు తన పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు రోడ్డు వరకు వ్యాపించాయి. ఈ క్రమంలో ధాన్యం బస్తాలకు అంటుకున్నాయి. గ్రామస్తులు గమనించి వెంటనే బస్తాల్లో నుంచి ధాన్యం కింద పారబోసి మంటలను అదుపులోకి తెచ్చారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా మంటలను పూర్తిగా ఆర్పేశారు. అగ్ని ప్రమాదంలో సుమారు 5 బస్తాల ధాన్యం దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు.


