నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్ఠ పర్చాలని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్ సూచించారు. ధర్మారెడ్డిలో శుక్రవారం వివిధ గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో అర్హులైన వారందరికీ అందేలా చూడాలన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. గ్రామాల్లో కార్యకర్తలందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. అనంతరం రెండోసారి కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా నియమితులైన శ్రీధర్‌గౌడ్‌ను వివిధ గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కిష్టయ్య, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీరాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


