ఇంధన భారం! | - | Sakshi
Sakshi News home page

ఇంధన భారం!

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

ఇంధన భారం!

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026

– 9లో u

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. దేశవ్యాప్తంగా పెట్రోలియం కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచడంతో అన్ని రంగాలపైనా ప్రభావం పడనుంది. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ. 108.62 ఉండగా.. 6 గంటల తర్వాత రూ. 111.88 కి చేరింది. అలాగే డీజిల్‌ లీటర్‌ ధర రూ. 96.65 నుంచి రూ. 99.91 కి చేరింది.

రోజుకు 6 లక్షల లీటర్ల వినియోగం..

జిల్లాలో వివిధ కంపెనీలకు సంబంధించి 110 పెట్రోల్‌ బంక్‌లు ఉన్నాయి. రోజూ సగటున పెట్రోల్‌ రెండు లక్షల లీటర్లు, డీజిల్‌ నాలుగు లక్షల లీటర్ల మేర అమ్ముడవుతోంది. దీంతో పెరిగిన ధరలతో ప్రజలపై రోజుకు రూ. 18 లక్షలపైనే భారం పడుతుందని అంచనా.

ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు..

ద్విచక్ర వాహనం దాదాపు ప్రతి ఇంటికొకటి కనబడుతోంది. అలాగే మధ్యతరగతివారు చాలావరకు కార్లు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి 2.50 లక్షలు ఉన్నట్లు రవాణా శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ద్విచక్రవాహనాల సంఖ్య 1,86,378. కాగా వాహనాలలో అత్యధికం పెట్రోల్‌తో నడిచేవి. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటీలు, కార్ల వైపు జనం మొగ్గు చూపుతున్నా.. వాటి శాతం తక్కువే. నిత్యం పనుల మీద తిరిగేవారు, ఉద్యోగరీత్యా, ఉపాధి కోసం వెళ్లేవారు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుంటారు. పెట్రోల్‌ ధర పెంపు ప్రభావం ద్విచక్రవాహనాదారులపై ఎక్కువగా పడనుంది.

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

లీటర్‌పై రూ.3 పెంపు

కామారెడ్డిలో లీటర్‌ పెట్రోల్‌

రూ. 111.88, డీజిల్‌ రూ. 99.91

పెరగనున్న రవాణా ఖర్చులు,

వ్యవసాయంపైనా భారం

Advertisement
 
Advertisement
Advertisement