బాన్సువాడ రూరల్: మొక్కజొన్న కొనగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కోనాపూర్‌లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన మక్కలను ఆలస్యం లేకుండా గోదాములకు తరలించాలని మార్క్‌ఫెడ్ అధికారులకు సూచించారు. 11,683 క్వింటాళ్ల మక్కలను గోదాములకు తరలించామని, మరో 3,700 క్వింటాళ్లు తరలించాల్సి ఉందని సొసైటీ కార్యదర్శి సురేందర్‌రావు కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్‌గౌడ్, ఏడీఏ అరుణ, సహకార సంఘం చైర్మన్ సంగ్రాం నాయక్, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, బంజ భూషణం, అక్తర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


